మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో మరణించారు. ప్రదీప్ వయస్సు 61 ఏళ్లు. 2001లో కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్ 70కి పైగా చిత్రాల్లో నటించాడు.
ప్రదీప్ విన్నైతాండి వరువాయా / ఏ మాయ చేసావేలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అలాగే రాజా రాణి, ఒరు వడక్కన్ సెల్ఫీ, తేరి, లైఫ్ ఆఫ్ జోసుట్టి, కుంజిరామాయణం, వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు, వంటి హిట్ సినిమాల్లో కూడా ప్రదీప్ నటించాడు.
ఎన్నో సినిమాల్లో తన నటనకు గానూ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ప్రదీప్ కు భార్య, మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రదీప్ మరణంతో మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇక కొట్టాయం ప్రదీప్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం జరగనున్నాయి.