యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రం పైనే డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి వంటి సెన్సెషన్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డీలా పడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను డైరెక్టర్స్ తెరకెక్కిస్తోన్న చిత్రాలపై డార్లింగ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
అయితే కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ మూవీ చేస్తుండడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ మన ముందుకు వచ్చేసింది.
సలార్ లో మలయాళ సూపర్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఓ ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు. అయితే ఆదివారం పృథ్వీ రాజ్ బర్త్ డే సందర్భంగా సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో అతని పేరు వరద రాజు మన్నార్ అని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
కాగా సలార్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తున్నారంటూ ముందునుంచే గుసగుసలు వినిపించాయి. ఇటీవల తాను నటించిన ‘కడువ’ చిత్ర ప్రమోషన్ లోనూ పృథ్వీరాజ్ సలార్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Birthday Wishes to the most versatile @PrithviOfficial, Presenting ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ from #Salaar.#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart
#HBDPrithvirajSukumaran pic.twitter.com/tE548jFK2e— Salaar (@SalaarTheSaga) October 16, 2022