సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ సర్కార్ వారి పాట. బ్యాంక్ ఫ్రాడ్‌కు సంబంధించిన కథతో పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ.. ఇప్పటిదాకా మూవీలో కీలక రోల్‌గా ఉండే మహేష్ ఫాదర్ ఎవరితో చేయించాలన్నదానిపై ఇన్నాళ్లూ మూవీ టీం క్లారిటికీ రాలేదు. చాలా మంది పేర్లు పరిశీలించిన తర్వాత మలయాళ సీనియర్ నటుడిని తీసుకోవాలని భావిస్తోంది.
‘అల.. వైకుంఠపురములో’ మూవీలో తండ్రి పాత్రలో ఒదిగిపోయిన మాలీవుడ్ నటుడు జయరామ్‌ను మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారట. జయరామ్ ఓ బ్యాంక్ మేనేజర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. బ్యాంకు మోసాలకు సంబంధించిన సినిమా అని చెప్తుండటంతో.. జయరామ్ పాత్ర ముఖ్యమైనదేనని అర్థమవుతోంది. కాగా మహేశ్ జోడీగా కీర్తీ సురేష్ నటిస్తోంది.