అమితాబ్ నటించిన పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. మరో వైపు గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కూడా సినిమా చేస్తున్నాడు. పవన్ అభిమానులందరూ కూడా హరీష్ తో చేయబోయే సినిమావైపే చూస్తున్నారు. కాగా గబ్బర్ సింగ్ సినిమా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హరీష్ స్పందిస్తూ పవన్ తో చెయ్యబోయే కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించబోతున్నట్లు ఓ అప్డేట్ ఇచ్చాడు.
మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్తమ్మాయిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడట హరీష్. ఆమె ఎవరో కాదు మలయాళ బామ మానస రాధాకృష్ణన్. ఈ అమ్మాయి వయసు 21 సంవత్సరాలట. కథానాయికగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొత్తం 8 సినిమా చేసిందట ఈ అమ్మడు. చేసిన సినిమాలు అన్ని చిన్న సినిమాలు కావటం తో పెద్దగా క్రేజ్ లేదు. అయినప్పటికీ పవన్ సరసన మాత్రం ఈ హీరోయిన్ నే హరీష్ ఫిక్స్ చేశాడని వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.