భారత్ లోకి పామాయిల్ దిగుమతిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మలేషియా ఆవేదన వ్యక్తం చేసింది. మలేషియా అధ్యక్షుడు మహతిర్ మహ్మద్ పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శలు చేయడంతో పామాయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. భారత్ తీసుకొచ్చిన కొత్త చట్టం పౌరసత్వానికి మత పరీక్ష అంటూ మలేషియా ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను భారత దేశం తప్పుబట్టింది. భారత ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మహ్మద్ తమ దేశం ఆర్ధికంగా నష్టపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం తప్పును తప్పే అంటానన్నారు.
ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది ఎక్కువగా మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. ఆ దేశ ప్రధాని విమర్శలతో ఎడిబుల్ ఆయిల్ దిగుమతిపై కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. 94 ఏళ్ల మలేషియా ప్రధాన మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు భారత్ తో దౌత్య సంబంధాలు చెడిపోయేలా చేస్తున్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ విషయంలో కూడా మహతిర్ మహ్మద్ స్పందిస్తూ కశ్మీర్ లోకి భారత్ చొచ్చుకు పోయి ఆక్రమించకుంది అని అన్నారు.