మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలను కార్పొరేటర్ శ్రవణ్ గురువారం సందర్శదించారు. పాఠశాల గదులతో పాటు ఆయన వంటశాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో వంటగదిలోనికి వెళ్లగానే ఒక్కసారిగా ఆయనకు వాంతులు అయ్యాయి. దీంతో ఆయన పాఠశాల యజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆయన పాఠశాలను పరిశీలించగా ఈ బాగోతం అంతా బయటపడింది. వంటలో నాణ్యత బాగాలేదని వెంటనే పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు విల్సన్ కు కార్పొరేటర్ సూచించారు.
దీని గురించి విల్సన్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకంలో ఒక్క భోజనానికి ఉన్నత పాఠశాలకు కేవలం రూ.7.45 , ప్రాథమిక పాఠశాల అయతే రూ.4.50 గుడ్డు పెట్టి కేవలం 5 రూపాయలు అదనంగా ఇస్తున్నారని, అందువల్లే నాణ్యత పాటించలేకపోతున్నామని తెలిపారు.
దీని గురించి శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఇలాంటి దౌర్భగ్యాపు పాలనలో పిల్లలకు విషపు తిండి పెడుతున్నారని విరుచుకుపడ్డారు.