మైక్ ముందుంటే మంత్రి మల్లారెడ్డి ఎంత ఓవరాక్షన్ చేస్తారో అందరికీ తెలుసు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి ముందు ఆయన చేసిన అతి.. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. అయితే.. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో తాజాగా రెడ్ల జేఏసీ ఏర్పాటుచేసిన రెడ్డి సింహగర్జన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆయనతోపాటు మూడుచింతల జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు. క్యాస్ట్ కు సంబంధించిన ప్రోగ్రాం కావడంతో అన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారు. మల్లారెడ్డి ఇదేదో టీఆర్ఎస్ సభ అనుకున్నారో ఏమో.. సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మా సారు అది చేశారు.. ఇది చేశారంటూ పథకాల లిస్ట్ చడవడం మొదలుపెట్టారు.
మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు మల్లారెడ్డి. పదే పదే టీఆర్ఎస్, కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడారు. అక్కడున్నవారు ఎంతసేపని వింటారు.. చివరకు విసిగిపోయి స్పీచ్ ను మధ్యలోనే అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుర్చీలు పైకి ఎత్తి కేకలు పెట్టారు. మంత్రి మాట్లాడుతుండగానే చెప్పులు, రాళ్ళు విసిరేసి నిరసన తెలియజేశారు.
Advertisements
ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏదైనా జరగొచ్చని భావించి.. ప్రసంగం ఆపేసి వెళ్లిపోయారు మల్లారెడ్డి. కానీ.. కార్యక్రమానికి వచ్చినవారు ఆయన కాన్వాయ్ వెంటపడి కుర్చీలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు.