జబర్దస్త్ ప్రోగ్రాం ఉంటుందా… నడపగలరా…? ఎక్కడ చూసిన ఇదే చర్చ. తన నవ్వుతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు వెంట చమ్మక్ చంద్ర కూడా వెళ్లటంతో, నాగబాబు కి సన్నిహితంగా ఉండే ఆది కూడా వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు .
కానీ హైపర్ ఆది జబర్దస్త్ లో కొనసాగుతున్నారని ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తుంది. అయితే జబర్దస్త్ లో కొనసాగటానికి హైపర్ ఆదికి మల్లెమాల ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దానికి సాక్షంగా ఢీ ఛాంపియన్స్ లో హైపర్ ఆది ఎంట్రీ. ఇటీవల ఢీ షోకి సంబందించిన ప్రోమో లో హైపర్ ఆది మెరిశాడు.
నాగబాబు కు ఎంతో సన్నిహితంగా ఉండే ఆది ఇప్పుడు నాగబాబుని కాదని కూర్చున్నాడు. మరి నాగబాబు ఏ మేరకు దీనిపై స్పందిస్తారో చూడాలి.