బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చిన జబర్దస్త్ షోకి ఎదురే లేదు అనేది ఎంత నిజమో మరో సారి నిరూపితమైంది. జబర్దస్త్ కు గత కొన్ని సంవత్సరాలుగా వెన్నుముకల ఉన్న నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిన తరువాత కూడా రేటింగ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతుంది. అయితే జబర్దస్త్ ను పోటీగా అదిరింది అంటూ నాగ బాబు మరో షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ షో అంతగా ఆకట్టుకోలేకపోతుంది. అంతేకాదు మరో వైపు రేటింగ్ కూడా తగ్గుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో నాగబాబు మరోసారి జబర్దస్త్ లో అడుగుపెట్టాలని ఆలోచనలో ఉన్నాడట. కానీ మల్లెమాల టీం మాత్రం దానికి ఇష్టపడట్లేదట. దానికి కూడా కారణం లేకపోలేదు. జబర్దస్త్ ను విడిచి వెళ్తున్న నాగబాబు సైలెంట్ గా వెళ్లకుండా మల్లెమాల టీమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఏడు సంవత్సరాలుగా లాభాలను చూసుకున్నారు కానీ కమెడియన్ల గురించి ఆలోచించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై మల్లెమాల నిర్వాహకులు నాగబాబు రీఎంట్రీ పై కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.
మరో వైపు నాగబాబు వెళ్లినప్పటి నుంచి కూడా రోజా పక్కన వారానికో కొత్త జడ్జ్ ని పెడుతున్నారు. సింగర్ మనో, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇలా వారానికి ఒకరితో సరిపెడుతున్నారు. అయినప్పటికీ షో రేటింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. మరి నాగబాబు రీఎంట్రీ పై మల్లెమాల నిర్వాహుకులు వెనక్కి తగ్గుతారా లేక అవసరం లేదని భావిస్తారో తెలియాలంటే అధికారికంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.