భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యాలు కనిపించాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు భారత్ జోడో యాత్రను నిన్న కాంగ్రెస్ రద్దు చేసింది. అయితే భద్రతా లోపాలు లేవని, యాత్రను రద్దు చేసే విషయంపై తమను కాంగ్రెస్ సంప్రదించలేదని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమిత్ షాను ఆయన కోరారు. రాహుల్ గాంధీకి తగిన స్థాయిలో భద్రత కల్పించాలని లేఖలో ఆయన కోరారు.
రాబోయే రెండు రోజుల్లో యాత్రకు మరియు జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో భారీ జనసమూహం చేరుతుందని మేము ఆశిస్తున్నాము. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఇతర ముఖ్య రాజకీయ పార్టీల నేతలు ఈ పర్వం కార్యక్రమానికి హాజరవుతున్నారు.
రాబోయే రెండు రోజుల్లో యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ నుంచి ప్రముఖ నాయకులు హాజరవుతారని చెప్పారు. అందువల్ల పటిష్టమైన భద్రత ఏర్పాటుకు పోలీసు శాఖను ఆదేశించాలని ఆయన కోరారు.