గోపీచంద్ మలినేని దర్శకత్వలో నందమూరి నట సింహం బాలకృష్ణ ‘ఎన్‌బీకే 107’ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొదటి హీరోయిన్‌గా శ్రుతీ హాసన్ నటిస్తోంది.
ఇక బాలయ్య 107వ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఎన్‌బీకే 107లో సెకండ్ హీరోయిన్‌గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈమె పలు మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో ఈమె నటించింది. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. మరి ఈమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక ఈ చిత్నాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత బాలయ్య.. దర్శకుడు అనిల్రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. సెప్టెంబరులో ఇది మొదలు కానుంది. బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.