అరాచకాలు బయటపెడితే అరెస్టు చేస్తారా? - Tolivelugu

అరాచకాలు బయటపెడితే అరెస్టు చేస్తారా?

మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

, అరాచకాలు బయటపెడితే అరెస్టు చేస్తారా?రవి ప్రకాష్‌కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం తన మాట కూడా వినకుండా రవి ప్రకాష్ ని అరెస్ట్ చేయడమంటే రాష్ట్రంలో పౌరుల హక్కులను కాలరాయడమే. టీఆరెస్ ప్రభుత్వం, వారి అనుచరుల ఆగడాలు, అరాచకాలు బయటపెడుతుంటే తట్టుకోలేక, నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నారు అనడానికి నిదర్శనమే రవి ప్రకాష్ అరెస్ట్. రవి ప్రకాష్ లాంటి సీనియర్ జర్నలిస్ట్‌కే ఈ పరిస్థితి వస్తే, మామూలు జర్నలిస్టుల పరిస్థితి ఏంటి అని అనిసిస్తోంది. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగడం ప్రభుత్వానికి మంచిది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, వ్యక్తుల స్వేచ్ఛ హక్కును మీరెలా కాలరాస్తారు ?

, అరాచకాలు బయటపెడితే అరెస్టు చేస్తారా?

 

Share on facebook
Share on twitter
Share on whatsapp