కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు సీనియర్ నేత మల్లు రవి. తాము అసలు కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి అని చెప్పలేదని.. 150 ఎకరాల్లో సీఎం వరి వేశారని మాత్రమే చెప్పామన్నారు. పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీస్ రాజ్యం నడుస్తోందా? అని ప్రశ్నించారు మల్లు రవి. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఆయన.. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టాల్సిన భాద్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు.