ధర్నా చౌక్ కు వెళ్లకుండా పోలీసులు ఉపాధ్యాయులను అరెస్ట్ లు చేయడం, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. ధర్నా చౌక్ ఉన్నదే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పాటు చేశారన్నారు.
ఉపాధ్యాయ సంఘాలు 317 జిఓ రద్దు తోపాటు పలు డిమాండ్లతో ధర్నాకు దిగితే వారిని అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి వాటికోసమే హక్కులను హరించేందుకు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారన్నారు.
ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు మల్లు. కేసీఆర్ నియంతృత్వ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాడు. కేసీఆర్ నియంతృత్వ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నాడు.
ప్రజలు ఈ నియంతృత్వ పాలనపై తిరగబడి ప్రజా పాలన ఏర్పాటు చేస్తారని హెచ్చరించాడు మల్లు.