కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విచారణ ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవిని విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తానే బాధ్యుడిగా ఉన్నట్లు మల్లు రవి పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ వార్ రూమ్ కు నేనే ఇంఛార్జ్ గా ఉన్నానన్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పినట్లు ఆయన వివరించారు.
కాంగ్రెస్ వార్ రూమ్ లో జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నామన్నారు.
ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదన్నారు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నామన్నారు. అలాగే సునీల్ కనుగోలుకు, వార్ రూమ్ కు ఎలాంటి సంబంధం లేదంటూ’ స్పష్టం చేశారు మల్లు రవి.