అచ్చంపేట రాజీవ్ రైతు దీక్షలో కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుని చేయాలని డీసీసీ అధ్యక్షులందరితో పాటు, మేం కూడా ఢిల్లీకి చెప్పామన్నారు. అచ్చంపేటలో రైతు దీక్ష సభ చూస్తే రేవంత్ రెడ్డిని పీసీసీ పదవికి రికమండ్ చేయడంలో తప్పులేదని రుజువైందంటూ మల్లు రవి కామెంట్ చేశారు.
తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని మల్లు రవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే రేవంత్ పీసీసీ కావాల్సిందేనని మల్లు రవి డిమాండ్ చేశారు. రైతుల కోసం పోరాటంలో రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకొని పోరాడాలని మల్లు రవి అచ్చంపేట దీక్షలో కోరారు.