కాంగ్రెస్ పార్టీ దేశమంతటా విస్తరించి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన… బీజేపీని గద్దె దించాలంటే బీజేపీయేతర పక్షాలు అన్నీ కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే… టిఎంసీ, ఆప్ లాంటి పార్టీలు కాంగ్రెస్ కు అండగా ఉండాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు మల్లు రవి. మూడో ప్రత్యామ్నాయ కూటమి పెడితే అది బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం అవుతుందని చెప్పారాయన.