పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కాలంలో ఆమె చేసే పనుల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నామధ్య ఆమె వేసిన పెయింటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆమె డార్జిలింగ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మోమోలను తయారు చేసి అందరికీ ఆమె చేతి రుచిని చూపించారు.
డార్జిలింగ్‌లోని స్థానిక స్టాల్‌లో ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మరో ఇద్దరు మహిళలతో కలిసి మోమోస్‌ను బయటకు తీస్తున్న వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది.
‘మమతా బెనర్జీ జననాయకురాలు. ఆమె మాస్ లీడర్. సింహాసనంపైనే కూర్చుండి ఉండిపోరు.
ఆమె ఎప్పుడూ ప్రతి బెంగాల్ కుటుంబంలో భాగమవుతారు.’ అని టీఎంసీ పార్టీ పేర్కొంది. ఈ వీడియోలో మమతా బెనర్జీ సాధరణ మహిళలా మోమోస్‌ను పాత్రలోంచి తీస్తున్నారు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతోంది. అందరూ ఆమె సింప్లిసిటీని ప్రశసింస్తున్నారు.
A leader of the masses and with the masses!
Hon'ble Chairperson @MamataOfficial is seen with the locals of Darjeeling wrapping dumplings.The heartwarming visuals remind us that our leader is not someone who sits in ivory towers, but who is a part of every family of Bengal. pic.twitter.com/8FdNLhV9at
— All India Trinamool Congress (@AITCofficial) July 14, 2022
Advertisements