బెంగాల్ లో మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణను చేపట్టనున్నట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మంత్ర వర్గ పునర్వ్యవస్తీకరణను బుధవారం చేపట్టనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
ఇటీవల మంత్రి పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు కావడానికి ముందు ఆయన దాదాపు 6 మంత్రిత్వ శాఖల బాధ్యతలను ఆయన చూస్తున్నారు.
ఇటీవల మరికొందరు మంత్రులు మరణించారు. దీంతో వారి పోర్టు ఫోలియోలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయా శాఖల బాధ్యతలు చూసుకోవడం సీఎంగా భారంగా మారుతోంది.
దీంతో మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్తీకరించాలని దీదీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంస్థాగత కార్యాకలాపాలను చూసుకునే బాధ్యతను కొందరు సీనియర్లకు అప్పగించనున్నట్టు ఆమె తెలిపారు.
ఈ క్రమంలో నలుగురు నుంచి ఐదుగురి వరకు మంత్రిత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సారి మంత్రి వర్గంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్టు సీఎం ప్రకటించారు.