బెంగాల్ మంత్రి పార్థ చటర్జీపై సీఎం మమతా బెనర్జీ వేటు వేశారు. ఆయన్ని కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు మమతా ప్రకటించారు. ఆయన ఆధీనంలో ఉన్న వాణిజ్య, పరిశ్రమల శాఖను మమతా తన చేతుల్లోకి తీసుకున్నారు.
ఇక మరోవైపు ప్రస్తుతం ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈడీ కేసుల నేపథ్యంలో ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగించే అవకాశం ఉన్నట్టు సమాచారం
ఇటీవల టీచర్స్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
చటర్జీ వల్ల పార్టీకి అప్రతిష్ట వస్తోందని అందుకే ఆయన్ని మంత్రి పదవితో పాటు పార్టీ నుంచి తొలగించాలని టీఎంసీ నేతలు కూడా బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చటర్జీపై మమతా వేటు వేసినట్టు తెలుస్తోంది.