టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2024లో దేశ ప్రధాని అవుతారని ఆ పార్టీ ఎంపీ అపరూప పోద్దార్ తెలిపారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2036లో బెంగాల్ సీఎం అవుతారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సోమవారం ట్వీట్ చేశారు.

అదే సమయంలో బెంగాల్ సీఎం పదవిని మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేపడుతారని ఆమె వెల్లడించారు. బెంగాల్‌లో టీఎంసీ మూడవసారి విజయం సాధించిన తర్వాత మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సోమవారం ట్వీట్ చేశారు.
2036 వరకు మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ సైనికునిగా తాను చెప్పగలరని ఆయన అన్నారు. 2036లో అభిషేక్ బెనర్జీ [మమత మేనల్లుడు] ప్రమాణ స్వీకారం చేస్తారని” అని ఘోష్ ట్వీట్ చేశారు. తాజాగా ఆ పోస్టుకు ఆమె అనుకున్న మార్పులు జత చేసి ట్వీట్ చేశారు.