మమతా మోహన్ దాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె అందంతోనే కాదు .. గాత్రంతోనూ ప్రేక్షకులని ఆలరించింది మమత. పెళ్లైన తరువాత మమత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. మమత మోహన్ దాస్ తెలుగులో యమదొంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటించిన ఆ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల మమతా మోహన్ దాస్ వరుసగా అనారోగ్యానికి గురైంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత ఆమె విటిలిగో అనే చర్మవ్యాధికి గురైంది.
ప్రస్తుతం మమతా మోహన్ దాస్ తన హెల్త్ పై ఫోకస్ పెట్టి పూర్తిగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌత్ లో టాప్ హీరోయిన్ గా పిలవబడే లేడీ సూపర్ స్టార్ నయనతారపై మమతా మోహన్ దాస్ విమర్శలు చేసింది. నయనతార వల్ల తాను ఎంతగా బాధపడ్డానో వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరొక నటి సెట్స్ లో ఉంటే తాను షూటింగ్ కి రానని నయన్ చెప్పినట్లు మమతా మోహన్ దాస్ పేర్కొంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో ఒక సాంగ్ చేసే అవకాశం నాకు వచ్చింది. నాలుగు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ చేశాం. షూటింగ్ అయితే జరిగింది కానీ.. ఫ్రేములో నేను లేనని నాకు అర్థమైంది. ఫైనల్ కాపీలో చూస్తే కేవలం ఒక్క షాట్ లో మాత్రమే కనిపించా. ఇదంతా నయనతార వల్లే అని తెలిసింది. ఈ సాంగ్ లో మరో హీరోయిన్ ఉందని నాకు చెప్పలేదని.. నేను షూటింగ్ కి రానని నయన్ వాగ్వాదానికి దిగిందట.
ఆమె బలవంతం చేయడం వెళ్లే నా షాట్స్ తొలగించారు. ఆ సాంగ్ వల్ల నాకు 4 రోజుల సమయం వృథా అయింది అని మమతా మోహన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ చిత్రం మరేదో కాదు ‘కథానాయకుడు. ఈ చిత్రంలో రజని, నయన్ జంటగా నటించారు. ఒక నటి పట్ల మరో నటి ఇంత దారుణంగా ప్రవర్తించడం సరైందేనా అంటూ మమతా మోహన్ దాస్ ఆవేదన వ్యక్తం చేసింది. మమతా మోహన్ దాస్ నయన్ పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.