సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ వర్గాలు ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే రజనీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నా ఆయన త్వరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కావాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా రజనీ త్వరగా కోలుకోవాలని ఆయనకు సందేశాలు పంపుతున్నారు.
కాగా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా రజనీ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. గెల్ వెల్ సూన్ సూర్య.. అన్‌పుదన్ దేవా.. అని ఆయన మెసేజ్ పెట్టారు. కాగా మమ్ముట్టి ఒకప్పుడు రజనీకాంత్‌తో కలిసి దళపతి సినిమాలో నటించగా ఆ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో ఆ ఇద్దరూ సూర్య, దేవాలుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. దీంతో మమ్ముట్టి రజనీని ఆ మూవీలోని పాత్ర పేరిట పిలుస్తూ త్వరోగా కోలుకోవాలని సందేశం ఇచ్చారు. అయితే మమ్ముట్టి చేసిన ట్వీట్‌కు రజనీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు వారు నటించిన దళపతి మూవీ గురించి, వారి మధ్య ఉన్న స్నేహాన్ని గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.
Get well soon Soorya
Anpudan Deva pic.twitter.com/r54tXG7dR9— Mammootty (@mammukka) December 26, 2020
కాగా నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ కూడా రజనీ ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు. రజనీ బాగానే ఉన్నారని, హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుమార్తె ఐశ్వర్యతో మాట్లాడానని, ఆయన త్వరగా డిశ్చార్జి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
#SuperStarRajinikanth is doing well. Spoke to his daughter Aishwarya in Hyderabad. Hoping he will be discharged soon. @rajinikanth Sir prayers for your speedy recovery. 💐💐💖
— KhushbuSundar ❤️ (@khushsundar) December 26, 2020
అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, నటులు పవన్ కల్యాణ్, కమలహాసన్ తదితరులు కూడా రజనీ త్వరగా కోలుకుని డిశ్చార్జి కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.
நண்பர் விரைவில் நலம் பெற வாழ்த்துக்கள் @rajinikanth
— Kamal Haasan (@ikamalhaasan) December 25, 2020
https://www.pinkvilla.com/entertainment/south/mammoottys-epic-tweet-rajinikanth-goes-viral-take-look-587435