మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి చాలా కాలం అయ్యింది. అయితే ప్రస్తుతం భీష్మ పర్వం సినిమా చేస్తున్నాడు మమ్ముట్టి. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తుంటే ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని అర్ధం అవుతుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, అర్జున్ సర్జా, అంజలి, దిలీష్ పోతన్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మార్చి 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఎప్పటినుంచో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మమ్ముట్టి మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.