మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించి చాలా కాలం అయ్యింది. ఆ హిట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి కోరిక తీరింది. మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భీష్మ పర్వం శుక్రవారం రిలీజ్ అయింది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది.
దీనితో థియేటర్స్ కు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. అంతే కాదు భీష్మ పర్వం సినిమా మోహన్‌లాల్ లూసిఫర్ ను అధిగమించి వారాంతపు హిట్‌గా నిలిచిందట.
ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో మొదటి వారతం లో భారీ వసూళ్లను సాధించిన చిత్రాల్లో భీష్మ పర్వం, లూసిఫర్, బాహుబలి 2, కాయం కులం కొచ్చున్ని, ఒడియన్ చిత్రాలు నిలిచాయి.
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన భీష్మ పర్వం చిత్రంలో అనసూయ, నదియా, సౌభిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి కీలక పాత్రల్లో నటించారు.