దళితులపై అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. దళితుల పశువులు వేరే వాళ్ల చేలో పడ్డాయని భూపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో ఓ దళిత మహిళను కులం పేరుతో దూషిస్తూ భూతులు తిడుతూ, కర్రతో కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి తోడు అతని వీరత్వాన్ని ప్రదర్శించటానికి వీడియో తీస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి కొట్టాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు జగన్ అధికారంలోకి వస్తే అన్ని కులాలను ఒకటే ప్రాతిపదికన చూస్తామన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీకు ఓటు వెయ్యటం వాళ్ళు చేసిన తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు.