జనవరి 6వ తేదీన షారుక్ ఖాన్ బంగ్లా తో పాటు ముంబైలోని కొన్ని ప్రదేశాలను పెల్చేస్తాను అంటూ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ఎక్కడ నుండి వచ్చింది, ఎవరు చేశారు అని ఎంక్వైరీ స్టార్ట్ చేసిన ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని తెలుసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి పేరు జితేష్ ఠాకూర్ గా గుర్తించారు.
జితేష్ ఠాకూర్ పై పలు సెక్షన్ల క్రింద కేసు కూడా నమోదు చేశారు. జితేష్ ఠాకూర్ మద్యానికి బానిసైన వాడని, గతంలో కూడా ఫేక్ కాల్స్ చేసి పోలీసులతో పడ్డాడని సమాచారం.
ఇకపోతే బాలీవుడ్ స్టార్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ కొత్త కాదు. గతంలో కూడా చాలాసార్లు షారుక్ ఖాన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.