అనుమతులు లేకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటన చెన్నై ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సౌదీఅరేబియాకు చెందిన ఓ వ్యక్తి చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతడిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. అతన్ని అడ్డుకున్నారు. అయితే.. తనవద్ద ఎలాంటి స్మగ్లింగ్ వస్తువులు లేవని బుకాయించాడు.
అయినా.. వినకుండా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో తనిఖీలు చేశారు. అందులో ఏం లేకపోవడంతో తన చెప్పులను కూడా పరిశీలించారు అధికారులు. అయినా ఏం దొరకకపోవడంతో.. వదిలేయాలనుకున్నారు. కానీ.. అతను బంగారాన్ని దాచి పెట్టిన విధానం చూసి కంగుతిన్నారు.
12 లక్షల విలువ చేసే 240 గ్రాముల బంగారాన్ని..గమ్ పేస్ట్ తో అరికాలుకు అతికించాడు. అది గమనించిన కష్టమ్స్ అధికారులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని.. బంగారాన్ని సీజ్ చేసినట్టు వెల్లడించారు.