రెండు రూపాయలు వివాదం నిండు ప్రాణం బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం వలసపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైకిల్ కి గాలి పెట్టిన తరువాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు సైకిల్ షాప్ యజమాని సాంబ పై సువర్ణరాజు అనే యువకుడు దాడి చేశాడు. తన స్నేహితుడు సాంబ ను కొట్టడంతో పక్కనే ఉన్న స్నేహితుడు అప్పారావు సువర్ణరాజు పై కత్తితో దాడి చేశాడు. అధిక రక్తస్రావం కావటంతో సువర్ణరాజుని కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతి చెందాడు.