యువతులను ప్రేమ పేరుతో నమ్మించి బంగారు అభరణాలను చోరీకి పాల్పడిన నిందితుడుని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 10లక్షల 25వేల రూపాయల విలువ గల 263 గ్రాముల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోలా కేశవకుమార్ గా పోలీసులు గుర్తించారు.
హన్మకొండ కూమార్ పల్లి ప్రాంతానికి చెందిన దేశిని కళావతి చిన్న కుమార్తె మూడు సంవత్సరాల క్రితం రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సినీ ఆర్టీస్ట్ గా ని పనిచేస్తున్న నిందితుడైన కోలా కేశవ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వీరి ఇద్దరి మధ్య ప్రేమ గా మారడంతో నిందితుడు సదరు యువతి నుంచి పలుమార్లు అర్థికంగా లబ్ధి పోందాడు. దీనితో నిందితుడు తనకు అర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని, ఈ సమస్యలు పరిష్కరించగలిగితే మనం పెళ్ళి చేసుకోవడం జరుగుతుందని నిందితుడు యువతిని నమ్మబలకడంతో సదరు యువతి తన ఇంటిలోని బంగారు అభరణాలను తీసుకోని నిందితుడికి అందజేసింది. చేతికి బంగారు అభరణాలు రావటంతో హైదరాబాద్ కు వెళ్ళేందుకు హన్మకొండ బస్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో హన్మకోండ బస్టాండ్ లో తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న కేశవ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించడంతో నిందితుడి వద్ద ఉన్న బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.