ఐదుగురిని పెళ్ళాడి డబ్బు,నగలతో ఉడాయించాడు ఓ వ్యక్తి. మోసపోయిన మహిళలు తమ భర్తను తమకు వెతికి పెట్టండని పోలీసులను ఆశ్రయించడంతో ఆ మోసగాడి ఘనకార్యం బట్టబయలయ్యింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో మహిళలకు మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించాడు ఓ వ్యక్తి. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారాలు సాగించి..ఐదుగురుని పెళ్ళిచేసుకుని నగలు,నగదుతోబాటు విలువైన సామాగ్రి కూడా తీసుకొని మాయ మైపోయాడు.
విషయం తెలియని అమాయక మహిళలు తమ భర్త ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టమంటూ పలు పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదులతో ఈ దొంగమొగుడి భాగోతం బయపడింది.బాధిత భార్యలంతా కలిసి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ఐదుగుర్నీ వివాహమాడిన మోసగాడు ఒకడేనని తేలింది.
ఒకే వ్యక్తి పైన పలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులు రావడంతో ఇతను ఐదు వివాహాలు చేసుకున్నాడని భార్యలకు తెలిసింది. దాంతో ఈ భార్యామణులంతా ఏకమై తమ చీటింగ్ మొగుడికోసం ఓ స్వచ్ఛంద సంస్థ…సహకారంతో వెతకడం మొదలు పెట్టారు.