హైదరాబాద్ అల్వాల్ హిల్స్ ప్రాంతంలో గృహిణీలను మోసం చేశాడు ఓ దుండగుడు. ఇంటి ముందు సిమెంట్ వేసి రోడ్డు బాగు చేస్తామని చెప్పి ఇద్దరు మహిళలు దగ్గర 8 వేల రూపాయలను కొట్టేశారు. ఒక పనిమనిషిని తీసుకొచ్చి వాకిలి తవ్వించాడు, అనంతరం రోడ్డు వెయ్యటానికి సంబందించిన మెటీరియల్ కొనటానికి డబ్బులు కావాలంటూ 8 వేలు తీసుకుని మాయమయ్యాడు. ఎంత సేపటికి రాకపోవటంతో ఆ వ్యక్తి తీసుకొచ్చిన పని మనిషిని అడిగారు. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన ఎవరో నాకు తెలీదు పని ఉంది అంటే వచ్చానని ఆ కూలి మనిషి చెప్పాడు. సదరు వ్యక్తి చేసిన మోసం తెలుసుకున్న మహిళలు తెల్లముఖాలు వేశారు. అదే వ్యక్తి ఆ ఏరియాలో ఇప్పటికే కొన్ని మోసాలకు పాల్పడ్డాడని తెలుసుకున్న మహిళలు, ఇంకెవ్వరు ఇలా మోసపోకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.