గులాబీ రాజ్యంలో మూడు దౌర్జన్యాలు.. ఆరు కబ్జాలు అన్నట్లుగా సాగుతోంది. రోజూ ఎక్కడో ఓచోట తన భూమిని కబ్జా చేశారని ఒకరు.. తనకే తెలియకుండా అమ్ముకున్నారని మరొకరు ఇలా ఎవరో ఒకరు బయటకు వస్తూనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాధితుడు న్యాయం చేయాలంటూ రేడియో టవర్ ఎక్కాడు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తరమతిపేటకు చెందిన కృష్ణ గౌడ్ కు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిని గ్రామ సర్పంచ్ మహేష్ గౌడ్ అమ్ముకున్నాడని చెబుతున్నాడు. తనకు న్యాయం చెయ్యాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ కుంట రేడియో టవర్ ఎక్కాడు.