బాలీవుడ్ నటిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ముంబై స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. 2017 డిసెంబర్ లో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎయిర్ విస్టారా ఫ్లయిట్ లో ఓ బాలీవుడ్ నటి పక్కన కూర్చున్న 41 ఏళ్ల వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రెండు గంటల ప్రయాణం నరకమనిపించిందని నటి తెలిపింది. బాధిత నటి అతని చేష్టలను సోషల్ మీడియాలో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ లో తన వారికి చూపించింది. అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నటి వయసు 17 సంవత్సరాలు కావడంతో ఆ వ్యక్తిపై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు చేపట్టిన స్పెషల్ జడ్జీ వికాస్ సచ్ దేవ్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు నిర్దారించింది. శిక్ష ఖరారును రిజర్వ్ లో ఉంచింది. బాధిత నటి ఇప్పుడు సినిమా రంగానికి దూరంగా ఉంటుంది.