ఒకప్పుడు కీళ్ళరిగేలా సైకిళ్ళు తొక్కి ఇంటింటికీ తిరిగి పాలు పోసేవారు. కొంత కాలానికి స్కూటర్లు, ఇతర మోటారు వాహనాలు అందుబాటులోకి వచ్చినా కష్టపడ్డానికే మొగ్గు చూపి ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించేవారు.కాలం సైకిళ్ళని మూలకి నెట్టేసి స్కూటర్ ఎక్కింది. దీంతో పాల బిజినెస్ కిక్ కొట్టింది. అవసరమైతే పాలకి బదులు డొక్కుడు నీళ్ళు ఎక్కువేసి పెట్రో కన్వీనియన్స్ కవర్ చేద్దామనో ఏమో..! ఖర్చైనా డొక్కు స్కూటర్లకి క్యాన్లు కట్టి వ్యాపారాలు పరుగులు పెట్టించింది.
ఇదంతా నిన్నమొన్నటి పాల వ్యాపారం. ఇప్పుడు కాలం బాగా మారింది. అది ఎంతలా అంటే.. ఓ వ్యక్తి ప్రీమియం బైక్ పై పాలమ్మడం మొదలెట్టాడు. అత్యంత ఖరీదైన హార్లే డేవిడ్ సన్ బైక్ కు పాల క్యాన్లు తగిలించుకొని పాలు అమ్ముతూ కెమెరాకు చిక్కాడు.
దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తి ఇంటింటికీ వెళ్లి పాలు పోసేందుకు ఖరీదైన బైకును ఉపయోగిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ, ఏంటీ అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు కానీ,వీడియోను అమిత్ బదనా అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. పాలు అమ్మేందుకు ఈ వ్యక్తి హార్లే డేవిడ్ సన్ బైక్ పై వెళ్తున్నాడు అని చెప్పడానికి.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఈ బైక్ ఖరీదెంతో తెలుసా? అక్షరాలా 11 లక్షలు. ఇదంతా చూశాక అతను పోసేది పాలా? నీళ్ళా? అనే సందేహం కలుగుతోంది కదా?