దుర్గా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గార్బా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని తారాపూర్ లో శివ్ శక్తి సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దసరా నవరాత్రి వేడుకలు జరిగాయి.
21 ఏళ్ల వీరేంద్ర సింగ్ రమేష్ గార్బా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అతడి అన్న రాజ్ పుత్ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరేంద్రను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. అయితే వీరేంద్ర మరణానికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. వీరేంద్ర సింగ్ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయిన వీడియోను అక్కడి స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక, వీరేంద్ర మృతితో అతడి కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కొడుకలా చిన్న వయసులోనే చనిపోవటంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
కాగా ఇటీవలి కాలంలో ఇలా డ్యాన్స్ చేస్తున్న సందర్భాల్లో గుండెపోటుతో మృతి చెందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా వైరల్ అవుతున్నాయి. అంతకుముందు, జమ్మూలో లైవ్ షో సందర్భంగా 20 ఏళ్ల కళాకారుడు స్టేజ్ పై మరణించగా, బరేలీలో పుట్టిన రోజు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఒక వ్యక్తి కుప్పకూలి మరణించాడు. వీరందరూ సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతోనే మరణించారు.
Anand :
गरबा खेलते खेलते एक शख्स की मौत।
तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था।
युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी।
वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA
— Janak Dave (@dave_janak) October 2, 2022