కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం చోటు చేసుకుంది. మంజీరా మాల్ లో రాజు అనే వ్యక్తి సడన్ గా గుండెపోటుతో మరణించాడు. రాజు మూడున్నర సంవత్సరాలుగా మంజీరా మాల్ లో HVAC టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి యథావిధిగా విధులకు వెళ్లిన రాజు రాత్రి 11.45 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే స్థానిక ఉద్యోగులు స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాజు గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. అయితే రాజు కుటుంబ సభ్యులు మంజీరా మాల్ యాజమాన్యాన్ని పరిహారం కోరగా.. మాకు సంబంధం లేదని దబాయించింది. ఇది బీజేపీ యోగానంద్ ఆఫీసు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
పరిహారం లేదు.. ఏమీ లేదు శవాన్ని తీసుకొని వెళ్లమంటూ అడ్డం తిరిగారు. రవాణా ఖర్చులకు రూ.3 వేలు ఇస్తామంటూ ఎగతాళి చేశారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.