సామాన్యంగా దొంగలను పట్టుకోవడానికి పోలీసులు మారు వేషాలు వేస్తుంటారు. లేకపోతే మఫ్తిలో ఉండి దొంగలను పట్టుకుంటారు. అలాగే దొంగలు కూడా పోలీసులను బురిడీ కొట్టించడానికి రకరకాల వేషాలు వేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ దొంగ అచ్చం ధూమ్ సినిమాలో లాగా ముసలి వేషం ధరించి బ్యాంకును దోచేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..0000011..అట్లాంటాకు ఆగ్నేయ ప్రాంతంలోని హెన్నీ కౌంటీలో ఓ వింత దొంగతనం చోటుచేసుకుంది. వృద్ధురాలి వేషంలో ఉన్న ఓ దొంగ వృద్ధురాలి వేషంలో పూల దుస్తులు, తెల్లటి స్నీకర్లు, ఆరెంజ్ లేటెక్స్ గ్లోవ్స్, తెల్లటి విగ్, డార్క్ ఫేస్ మాస్క్ , పింక్ బ్యాగ్,తుపాకీతో మెక్‌డొనాఫ్ నగరంలోని చేజ్ బ్యాంక్‌లోకి వచ్చాడు. డబ్బు ఇమ్మని డిమాండ్ చేస్తూ బ్యాంక్ సిబ్బందికి ఓ నోట్ ఇచ్చి బెదిరించి డబ్బులు తీసుకున్నాడు.
తర్వాత ఆ వ్యక్తి ఒక చిన్న తెలుపు ఎస్ యూవీలో వెళ్లిపోయాడు. అసలు దొంగతనం చేసే సమయంలో ఎలాంటి అనుమానం రాకపోవడం విశేషం. ఎంచక్కా పని కానిచ్చుకుని మారు వేషంలోనే వెళ్లిపోయాడు. బ్యాంకు సీసీకెమెరాలోని చిత్రాలను పోలీసులు సోషల్ మీడియాలో ఉంచారు. కానీ ఏం లాభం… దొంగను గుర్తించడం ఎవరికి సాధ్యం కాని పని.
కానీ సోషల్ మీడియాలో చిత్రాలను చూసిన నెటిజన్లు మాత్రం దొంగను విపరీతంగా ప్రశంసిస్తున్నారు. ఒంటరిగా వచ్చి బ్యాంక్ ను దోపిడి చేసిన దొంగను వైరటీగా మెచ్చుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే… పోలీసులు విడుదల చేసిన ఫొటోల్లో దొంగను గుర్తించడం ఏ మాత్రం సాధ్యం కాదు.