కన్న తండ్రి జ్ఞాపకాలు అంటే అంతే.. ఆ మాటకొస్తే తల్లి లేదా తండ్రి ఎవరైనా సరే.. మన మధ్య ఉన్నప్పుడు మనకు ఏమీ అనిపించదు. వారు పోయిన తరువాతే వారి విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. వారు మనకు పంచిన ఆత్మీయ అనురాగాలు, ప్రేమ, అనుబంధం, వారితో గడిపిన తీపి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి. సరిగ్గా ఆ యువకుడు కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. ఎప్పుడో చనిపోయిన తన తండ్రి తనకు 21 ఏళ్లు వచ్చాక అందజేయమని ఓ గిఫ్ట్‌ను తనకు తెలియకుండానే తన సోదరికి ఇవ్వగా.. దాన్ని అతను ఇటీవలే అందుకున్నాడు. ఈ క్రమంలో అతను తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ బాధాతప్త హృదయంతో పోస్టు పెట్టాడు. ఆ పోస్టు నెటిజన్ల కంట కన్నీరు తెప్పిస్తోంది.
మ్యాట్ గుడ్‌మాన్ అనే యువకుడికి 21 ఏళ్లు. ఇటీవలే బర్త్ డే జరుపుకున్నాడు. 6 ఏళ్ల కిందట తన తండ్రి చనిపోయాడు. అయితే అప్పుడు ఆయన మ్యాట్‌కు అందజేయాలని 10 డాలర్లను తన కుమార్తెకు ఇచ్చాడు. మ్యాట్‌కు 21 ఏళ్లు రాగానే ఆ 10 డాలర్లను అతనికి ఇవ్వాలని, దాంతో అతను తొలిసారిగా ఆ 10 డాలర్లతో బీర్ కొనుక్కుని తాగుతాడని అతని తండ్రి ఆమెకు చెప్పాడు. ఈ క్రమంలో మ్యాట్‌కు ఇటీవలే 21 ఏళ్లు నిండాయి. దీంతో అతని సోదరి అతనికి తమ తండ్రి అందజేసిన 10 డాలర్లను ఇచ్చింది.
almost 6 years ago before my dad passed he gave my sister this 10$ bill to give to me on my 21st birthday so he could buy me my first beer, cheers pops havin this one for you! pic.twitter.com/oaIulpEJTc
— Matt Goodman (@mattg12699) December 6, 2020
I lost my dad a year ago today 😞♥️ this is beautiful even though I’m crying responding to it pic.twitter.com/o6YZQ44LA5
— 🍁 • Elio • 🍁 (@Canuck_Grump) December 8, 2020
I hope you are doing okay today. The first anniversary is the hardest. Sending all my love to you, even tho I know your dad’s love is already surrounding you🤍
— Delaney (@delaney_ks) December 8, 2020
అయితే తన తండ్రి ఎప్పుడో 6 ఏళ్ల క్రితం తన కోసం 10 డాలర్లను ఇచ్చాడని, దాంతో మొదటిసారిగా బీర్ తాగమని చెప్పాడనే విషయం తన సోదరి ద్వారా తెలుసుకున్న మ్యాట్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అసలు తనకు ఆ విషయం తెలియదని చెప్పాడు. అంతేకాదు, తన తండ్రి కోరిక మేరకు ఆ 10 డాలర్లతో బీర్ కొనుక్కుని తాగాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్ అవుతోంది.
This is so great! My dad passed when I was 13. What I’d give to simply have a beer, watch a game, play cards, or just have a simple conversation with him. But I know he’s in a better place and that makes me happy.
Thank you for sharing.
— Lane Taylor (@L_taylor57) December 8, 2020
Happy birthday Matt. Your dad seems like one hell of a guy.
— Ry (@ShewwWheelSnipe) December 7, 2020
Advertisements
ఇక మ్యాట్ పెట్టిన ఆ పోస్టుకు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారు కూడా చనిపోయిన తమ తండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. వారితో తమకు ఎంత అనుబంధం ఉండేదో వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో మ్యాట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి ఇప్పటికే 5.29 లక్షలకు పైగా లైక్‌లు, 1000కి పైగా కామెంట్లు, 25వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. తాను తన తండ్రిని ఏడాది కిందటే కోల్పోయానని ఇప్పుడు ఈ పోస్టు చూస్తుంటే నాకు కన్నీరు వస్తుందని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మీ డ్యాడ్ చాలా సూపర్బ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు మ్యాట్ పోస్టుకు స్పందిస్తున్నారు.