మహారాష్ట్ర ముంబైలో విషాదం చోటు చేసుకుంది. లాల్ బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే ఓ వ్యక్తి మంటల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ కిందపడిపోయాడు.
19వ అంతస్తు నుంచి వ్యక్తి పడిపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలాసేపు వేలాడుతూ కనిపించాడు ఆ వ్యక్తి. 12 ఫైర్ ఇంజెన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు.