భాగ్యనగరంలో భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట్ లో ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లో పడ్డాడు. బైక్ పై వెళ్తూ.. నాలా దాటుతున్న సమయంలో కింద పడిపోయాడు.
ఇటు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగమ్మ డివిజన్ లక్ష్మినగర్ లో చిన్నపాటి వర్షానికే మూడు అడుగుల మేర నీరు చేరింది. ఇంకా వర్షం పుడుతుండడంతో ప్రజలు బయం భయంగా ఉన్నారు.
నగరంలో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. మ్యాన్ హొల్స్ పొంగిపొర్లుతున్నాయి. వాహన దారులు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. GHMC , DRF, అత్యవసర విభాగాలు రంగంలోకి దిగాయి.
మరోవైపు రాగల మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.