కర్నూల్ జిల్లా నంద్యాలలో పెళ్లి పీటల మీద ఓ పెళ్లి ఆగిపోయింది. తిరుపతిలో ఒకరితో నిశ్చితార్ధం, నంద్యాలలో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు మోహన్ కృష్ణ అనే ప్రబుద్దుడు. నంద్యాలలో వివాహం జరుగుతున్న సమయంలో తిరుపతికి చెందిన యువతి బంధువులు వచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. వివాహానికి ముందే తిరుపతికి చెందిన యువతి కుటుంబ సభ్యుల దగ్గర 14 లక్షలు కట్నం తీసుకున్నాడు మోహన్ . మరో వైపు నంద్యాలకు చెందిన యువతి తో కట్నంగా 16 లక్షలు తీసుకుని పెళ్లికి సిద్దమయ్యాడు. పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు పెళ్లి కుమారుడు మోహన కృష్ణ ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘర్షణలో యువతి పెదనాన్న గుండెపోటుతో మృతి చెందాడు.