పవన్ పిలుపునిచ్చిన ‘లాంగ్ మార్చ్’ సందర్భంగా విశాఖలో జరుగుతున్న జనసేన సభలో అపశృతి చోటుచేసుకుంది. బారికేడ్లకు విద్యుత్ షాక్ రావడంతో వాటిని ఆనుకుని ఉన్న ఇద్దరు జనసేన కార్యకర్తలకు షాక్ తగిలింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు విద్యుత్‌ను నిలిపివేశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వల్ప తొక్కిసలాట జరిగింది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » పవన్ సభలో కరెంట్ షాక్ కలకలం!