కృష్ణా జిల్లా చిన్నారి హత్య కేసులో జిల్లా కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది.ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన హత్య చేసిన నిందుడుకి ఉరి శిక్ష విధించింది. 2019 నవంబర్ 10 న విజయవాడలో ద్వారక అనే బాలిక అపహరణకు గురైంది. ద్వారకను అపహరించి హత్య చేసిన నిందితుడు పెంటయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన విజయవాడ పోలీసులు పెంటయ్య నేరం కి పాల్పడినట్లు చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పెంటయ్య కు కోర్ట్ ఉరిశిక్ష విధించింది. గతంలో తోటి విద్యార్థిని ని అతి కిరాతకంగా హత్య చేసిన మనోహర్ అంశంలోనూ కోర్ట్ ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే.