విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ కు ఆనుకోని అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానమే పెనుభూతమై… నిర్దాక్షిణ్యంగా ఓ 24 ఏళ్ల యువకున్ని పొట్టనపెట్టుకున్న ఘటన ఇది.
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదర్శపల్లి గ్రామం ఉంది. అక్కడ ఓ మహిళ చనిపోయింది. అయితే ఆ మహిళ చావుకు కారణం చేతబడే కారణమని, ఆ చేతబడి చేసింది అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడని అనుమానించిన గ్రామస్థులు…. చనిపోయిన మహిళ కాష్టంలొనే వేసి సజీవ దహనం చేశారు స్థానికులు.
అయితే విషయం లేట్ గా బయటకు రావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.