ఇద్దరిమధ్యా ఎలాంటి పొరపొచ్చాలున్నాయో తెలియదు. సెకెన్లలో వాళ్ళిద్దిరి మధ్య వాగ్వాదం పెరిగింది. అంతే ఆగ్రహించిన యువకుడు ఆ యువతిని హెల్మెట్ తో చితకబాదిన సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలో ఓ యువతిని 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్ళిన ఘటన మరువక ముందే హార్యానాలో అర్ధరాత్రి ఓ యువకుడు…యువతిని హెల్మెట్ తో చితక బాదిన సంఘటన చోటు చేసుకుంది. తన ద్విచక్ర వాహనం వెళ్ళడానికి నిరాకరించినందుకు ఆగ్రహించిన యువకుడు ఆమెపై హెల్మెట్ దాడి చేసినట్లు తెలుస్తోంది.
సీసీటీవీ విజువల్స్ ప్రకారం ఆటో గుర్ గ్రామ్ ప్రాంతంలో ఆగగా అందులో నుంచి ఓ మహిళ దిగింది.అదే సమయంలో కమల్ అనే వ్యక్తి బైక్ పై వచ్చాడు. ఆమెను బైక్ ఎక్కమన్నాడు ఆమెనిరాకరించింది. సదరు మహిళ, కమల్ కొంతసేపు వాగ్వాదానికి దిగారు.
ఏం జరిగిందో తెలియదు ఆగ్రహించిన కమల్ తన వద్దనున్న హెల్మెట్ తో ఆమెపై దాడి చేసాడు. ఆమె కూడా ధీటుగానే ప్రతిఘటించింది.దీంతో చుట్టు పక్కల స్థానికులు ఆటో డ్రైవర్ కలుగజేసుకుని అతికష్టం మీద అతడిని అదుపు చేసారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన పోలీసులు పలు సెక్షన్లకింద కమల్ పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మనోజ్ తెలిపారు.
#WATCH | Haryana: CCTV footage of a man named Kamal hitting a woman with his helmet after she refused to ride on his bike. pic.twitter.com/Az3MWRKKWo
— ANI (@ANI) January 6, 2023