కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సైన్యంలో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్ మెంట్ విధానమైన అగ్నిపథ్ పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలోని మథురలో నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఆందోళనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
అయితే నిరసనకారుల దాడులు, పోలీసుల ప్రతిఘటన మధ్య ఓ కుటుంబం చిక్కుకుంది. దీంతో కుమారుడ్ని ఎత్తుకుని ఓ వ్యక్తి రక్షణ కోసం పోలీసులు ఉన్న వైపు పరుగులు తీశాడు. అతడి భార్య కూడా ఆయనను అనుసరించింది. చివరకు చిన్నారితో సహా వారిద్దరూ పోలీసు రక్షణ కవర్ ఉన్న వైపు సురక్షితంగా చేరుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శుక్రవారం ఉదయం తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా రైల్వే స్టేషన్ లోకి కొందరు నిరసనకారులు ప్రవేశించి, రైలు బోగికి నిప్పుపెట్టారు. అలాగే రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.
A man runs for cover with his child during stone pelting on the national highway in Mathura , UP by #AgneepathScheme protestors … pic.twitter.com/nvpxPb0jI5
— Alok Pandey (@alok_pandey) June 17, 2022
Advertisements