ప్రపంచ వ్యాప్తంగా ఏటా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఉన్న జనాలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. దీంతో పెరిగే జనాభా వల్ల ప్రజలకు సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అతను గుర్తుంచుకున్నాడో లేదో కానీ.. నెటిజన్లు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకేసారి ఏకంగా 6 మంది మహిళలను అతను గర్భవతులను చేశాడు. అనంతరం వారిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈవిషయం నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.
నైజీరియాకు చెందిన మైక్ ఎజె-ఎన్‌వాలీ ఎన్‌వొగు అనే వ్యక్తి ఓ నైట్ క్లబ్‌కు ఓనర్. అయితే అతను 6 మంది మహిళలను ఇటీవల గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. కానీ వారు అప్పటికే గర్భవతులు. వారందరూ ఒకేసారి గర్భం ధరించారు. గర్భంతో ఉన్నవాళ్లను అతను పెళ్లి చేసుకున్నాడు. పింక్ కలర్ సూట్ అతను ధరించగా, ఆ మహిళలు సిల్వర్ కలర్ డ్రెస్సులు ధరించి వివాహాలు చేసుకున్నారు. అనంతరం మైక్ ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.
మైక్ అలా ఆరు మందిని గర్భవతులను చేసి వారిని పెళ్లిచేసుకోవడంపై నెటిజన్లు చాలా మంది మండిపడుతున్నారు. జనాభా పెరుగుదల, దాని సమస్యలు అసలు నీకు తెలుసా.. మతి ఉండే ఈ పనిచేశావా.. అతను ఎప్పుడూ అంతే, ఒక్కో ఏడాది ఒక్కో రకంగా పిచ్చిగా ప్రవర్తిస్తాడు.. అసలు వాళ్లు నిజంగా గర్భవతులేనా.. ఇలా నెటిజన్లు అతన్ని విమర్శిస్తున్నారు.
Watch Video:
అయితే మైక్ నిజానికి ఒక ప్లే బాయ్ తరహా వ్యక్తి. అతను చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అతను చేసే పనులు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ వివాదాస్పదమవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.