జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంటి దగ్గర ఓ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందిని పరుగులు పెట్టించాడు. ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు.
కారులో వచ్చిన ఆ వ్యక్తి నేరుగా దోవల్ ఇంట్లోకి వెళ్లేందుకు చూశాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ సెల్ అతడ్ని విచారిస్తోంది.
ఢిల్లీ పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి తన శరీరంలో చిప్ ఉందని తనను ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు చెప్పాడు. ఎంఆర్‌ఐ స్కాన్ చేసి చూడగా ఎలాంటి చిప్ కనిపించలేదు.
ఇతను బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తోందని చెబుతున్నారు పోలీసులు. కిరాయి కారుతో దోవల్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడని తెలిపారు.