లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంపై అన్నా తమ్ముళ్ల మధ్య మాటా మాటా పెరిగి తమ్ముడి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన ముంబై లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…ముంబై కాందీవలికి చెందిన రాజేష్ లక్ష్మీ ఠాకూర్ తన భార్యతో కలిసి సరుకులు కొనడానికి బయటకు వెళ్లారు. వారు మార్కెట్ నుంచి తిరిగి రాగానే బయటకు వెళ్లాల్సి నంత అర్జెంట్ ఏముందని అతని తమ్ముడు దుర్గేష్ ప్రశ్నించాడు. ఈ విషయంలో అన్నా దమ్ముల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. వారిని వారించేందుకు ప్రయత్నించిన రాజేష్ భార్య ను దుర్గేష్ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్ వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి తమ్ముడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన దుర్గేష్ ను సమీపంలోకి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. పోలీసులు రాజేష్ మీద మర్డర్ కేసు నమోదు చేశారు.